పులుసులో పులుపు ఎక్కువైతే..

పులుసులో పులుపు ఎక్కువైతే..

ఇడ్లీ.. దోసెకు పప్పు నానబెట్టే టైం లేకపోతే.. ఒక గిన్నెలో మినప్పప్పు వేసి బాగా కడగాలి. తర్వాత నిండా నీళ్లు పోసి మధ్యలో అట్లకాడ పెట్టాలి. ఇలా చేస్తే పప్పు రెండు గంటల్లోనే నానుతుంది. 

మునక్కాడలు రెండుమూడు రోజులకే ఎండిపోతాయి. అలా కాకూడదంటే మునక్కాడల్ని మార్కెట్ నుంచి తెచ్చాక నీళ్లలో కాసేపు ఉంచాలి. లేదా అంచులు కట్​ చేసి చిన్న ముక్కలుగా కోసి గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేయాలి. 

వడలు వేసేటప్పుడు ఒక్కోసారి నూనె బయటికి చిందడం, పేలి మీద పడటం లాంటివి జరుగుతుంటాయి. దీనికి కారణం పిండిలో నీళ్లు ఎక్కువ అవడమే. అలాంటప్పుడు కాగుతున్న నూనెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వడలు, గారెలు వేస్తే పొంగవు. 

ఎక్కువ రోజులు స్టోర్​ చేసిన క్యాబేజీతో కూర చేస్తే ఒక రకమైన స్మెల్​ వస్తుంది. టేస్ట్​ కూడా బాగుండదు. అలాంటప్పుడు అల్లం సన్నగా తరిగి కూరలో వేస్తే టేస్టీగా ఉంటుంది. స్మెల్​ కూడా బాగుంటుంది.

కూరల్లో కారం ఎక్కువైతే చింతపండు రసం పోయాలి. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే ఆలుగడ్డ తొక్క తీసి ముక్కల్లా కట్​ చేసి వేయాలి. కొంచెంసేపు ఉంచితే అవి కూరల్లోని ఉప్పుని పీల్చుకుంటాయి. ఆ తరువాత తీసేయాలి. కొంచెం గోధుమ పిండి తీసుకుని అందులో సరిపడా నీళ్లు పోసి ముద్దలా  చేయాలి. ఆ తర్వాత చిన్నచిన్న ఉండలు చేసి కూరలో లేదా పులుసులో వేసినా ఉప్పు తగ్గుతుంది. పులుసులో పులుపు ఎక్కువైతే కాస్త బెల్లం వేయాలి.