నక్సలైట్లకు కరోనా సోకితే వైద్యం చేయిస్తాం.. 

నక్సలైట్లకు కరోనా సోకితే వైద్యం చేయిస్తాం.. 
  • అయితే జనజీవన స్రవంతిలో కలవాలి
  • దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ప్రకటన

ఛత్తీస్ ఘడ్: నక్సలైట్లకు కూడా కరోనా సోకి ఉంటే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కట్టుబడి ఉన్నామని.. అయితే వారు జనజీవన స్రవంతిలో కలవాలని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ప్రకటించారు. మావోయిస్టులకూ కరోనా చికిత్స ఒకటే కాదు.. ఇతర అనారోగ్యాలకు గురైనా వారికి మంచి వైద్యం చేయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని  దంతేవాడ,బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 50 మంది మావోయిస్టులు కరోనా తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం వస్తోందని..వీరిలో మోస్ట్ వా0టెడ్ మహిళ మావోయిస్టు సుజాత(25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్,దినేష్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. వీరంతా జనజీవన స్రవంతి లోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ sp అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.