పాన్​‑ఆధార్​ లింక్​ కాకుంటే రూ.1000 ఫైన్

పాన్​‑ఆధార్​ లింక్​ కాకుంటే రూ.1000 ఫైన్

న్యూఢిల్లీ: ఆధార్– పాన్ కార్డు లింకింగ్​కు చివరి తేదీ ఈ నెల 30న ముగుస్తుంది. అంతకుముందు ఈ గడువు 31 మార్చి 2022 వరకు ఉండేది. రూ.500 చివరి జరిమానాతో 30 జూన్ 2022 వరకు పొడిగించారు. జూన్​లోపు  పాన్ కార్డ్ హోల్డర్ తన  కార్డ్‌‌‌‌‌‌ను ఆధార్ నంబర్‌‌ను లింక్​ చేయించుకోకుంటే లింకింగ్​ చేయించుకోవడానికి రూ. వెయ్యి లేటు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234హెచ్​ (మార్చి 2021లో ఫైనాన్స్ బిల్లు ద్వారా చేర్చారు) ప్రకారం  మార్చి 31లోగా పాన్‌‌ను ఆధార్‌‌తో లింక్ చేయకపోతే రూ.1,000 వరకు జరిమానా వేస్తారు. ఇలాంటి పాన్ కార్డ్‌‌లు మరో ఏడాది పాటు పనిచేస్తాయి.  2023 మార్చి లేదా 2023 ఫైనాన్షియల్​ ఇయర్ వరకు, ఐటీఆర్​ ఫైల్ చేయడం, రీఫండ్‌‌లు  ఇతర ఐటీ క్లెయిమ్​ల కోసం వీటిని వాడుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) సర్క్యులర్ ప్రకారం, మార్చి 31, 2022 తర్వాత కానీ 30 జూన్ 2022లోపు కానీ తమ పాన్‌‌ను 12-అంకెల యూనిక్ యూఐడీఏఐ నంబర్‌‌తో లింక్ చేస్తే  రూ.500 లేట్​ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.   జూన్ చివరి నాటికి తమ పాన్‌‌ను ఆధార్ నంబర్‌‌తో సీడ్ చేయని వారు తమ పాన్‌‌ను ఆధార్ నంబర్‌‌తో లింక్ చేసుకోవడానికి రూ.1,000 జరిమానా చెల్లించాలి. లేట్​ ఫీజు చెల్లించిన తర్వాత  పాన్– ఆధార్‌‌ను లింక్ చేయవచ్చు.

లేట్​ ఫీజును ఎలా చెల్లించాలి ?

మేజర్ హెడ్ 0021   & మైనర్ హెడ్ 500 (ఫీజు)తో చలాన్ నంబర్ ఐటీఎన్​ఎస్​ 280 ద్వారా  లేటు ఫీజు చెల్లించాలి.    మ్యూచువల్ ఫండ్‌‌లు, స్టాక్‌‌లు కొనడం, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైనవాటికి తప్పనిసరిగా పాన్ కార్డ్‌‌ కావాలి.  లేకుంటే ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టలేరు కాబట్టి ఇది యాక్టివ్​గా ఉండటం తప్పనిసరి. ఎవరైనా చెల్లని పాన్ కార్డ్‌‌ను అందజేస్తే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బీ ప్రకారం, అసెసింగ్​ అధికారి సంబంధిత వ్యక్తికి  రూ.పదివేల జరిమానా విధించవచ్చు.
పాన్‌‌‌‌ను ఆధార్‌‌తో ఎలా లింక్ చేయాలి