
హైదరాబాద్: కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగుకు బాణసంచా అమర్చిన పైనాపిల్ ను ఆహారంగా అందించి.. ఆ మూగజంతువు చావుకు కారణమైన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే అటవి శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ నేరేడ్‌మేట్ లోని దేవి నగర్ లో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. ఏనుగును హతమార్చిన వారి ఆచూకీ తెలిపిన వారికి తనవంతుగా రెండు లక్షలు నగదు అందజేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కేరళ లో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారత దేశాని కుదిపేసింది , మనిషి ఇంత అరాచకాని కి దిగజారుతాడా అనే ఆలోచన అందరిలో కలిగించింది . లాక్ డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగ జీవాలకు తన సొంత గ్యారేజ్ లో ఆహారం వండి నగర వ్యాప్తంగా పంపిణీ చేసే వారు ఒక వైపు ఉండగా , మరోవైపు ఆహారంలో పేలుడు పదార్ధాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు” అని అన్నారు.