అధికారంలోకి వస్తే.. సీఏఏను రద్దు చేస్తాం

అధికారంలోకి వస్తే.. సీఏఏను రద్దు చేస్తాం
  •       సీపీఐ మేనిఫెస్టో రిలీజ్ 

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే సిటిజన్​షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(సీఏఏ)ను రద్దు చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎత్తేస్తామని, ఉపాధి హామీ పథకం కింద కూలీని రూ.700కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే పనిదినాలను ఏడాదికి 200 రోజులకు పెంచుతామని పేర్కొంది. శనివారం ఢిల్లీలో సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా ఈమేరకు పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, ప్రైవేట్ సెక్టార్​లోనూ రిజర్వేషన్లు పెడతామని ప్రకటించారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను పార్లమెంట్ పరిధిలోకి తెస్తామన్నారు. దేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని గద్దె దింపాలని ఆయన పిలుపునిచ్చారు.