రోగాలొస్తే ఆస్పత్రికి 25 కిలోమీటర్లు పోవాల్సి వస్తోంది: ఆదివాసులు

రోగాలొస్తే ఆస్పత్రికి 25 కిలోమీటర్లు పోవాల్సి వస్తోంది: ఆదివాసులు

ఆసిఫాబాద్, వెలుగు : ‘జల్ జంగల్ జమీన్’ అంటూ నిజాంతో పోరాడిన కుమ్రంభీం పోరుగడ్డ జోడేఘాట్ తో పాటు కోలాంగుడా, పాట్నపూర్, పెద్ద పాట్నపూర్, శివగుడా, బాబేఘరి, మహరాజ్ గుడా, పాటగుడా, చాల్ బాడీ, టోకెన్ మోవాడ్, లైన్ పటార్, పిట్టగుడా గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఈ గ్రామాల్లో ఆనారోగ్యానికి గురైతే వనమూలికలు తప్ప, మెడిసిన్​ దొరకదు. పాట్నపూర్ లో సబ్ సెంటర్ ఉన్నా.. అక్కడ స్టాఫ్​ లేరు.  రోగాలొస్తే ఆస్పత్రికి 25 కిలోమీటర్లు పోవాల్సిన వస్తోందని ఆదివాసులు అంటున్నారు. ఆసిఫాబాద్ నుంచి జోడేఘాట్ దాకా ప్రస్తుతం ఆర్టీసీ బస్సు కూడా లేదు.  

నాయకులు స్పందించి  రోడ్డు , పోడు రైతులకు  రైతు బంధు, రైతు భీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తామని జోడేఘాట్​లో ఏటా కుమ్రంభీమ్​ వర్ధంతికి నాయకులు  స్పీచ్​లు ఇచ్చి తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నారని విమర్శలున్నాయి. గిరిజనులకు సౌకర్యాలు, భూములకు పట్టాలు అందిస్తామని ప్రతిసారి ఎన్నికల్లో, భీం వర్దంతి, దర్బార్ లో ఇచ్చిన హామీలన్ని నీటిమూటలుగానే మిగులుతున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.