రాత్రిపూట బ్రైట్ లైటింగ్తో.. హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56% ఎక్కువ.. ఫోన్ స్క్రీనింగ్ తోనూ చాలా రిస్క్

రాత్రిపూట బ్రైట్ లైటింగ్తో..  హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56%  ఎక్కువ.. ఫోన్ స్క్రీనింగ్ తోనూ చాలా రిస్క్

ఫ్లిండర్స్ వర్సిటీ స్టడీలో వెల్లడి

అడిలాయిడ్:   రాత్రిపూట బ్రైట్ లైట్ల వెలుతురులో ఉండటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 56 శాతం పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకుల స్టడీలో తేలింది. 40 ఏళ్లు పైబడినోళ్లలో  రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఫ్లిండర్స్ వర్సిటీ  రీసెర్చర్లు.. యూకేలో 89 వేల మంది చేతులకు సెన్సర్లు అమర్చి, తొమ్మిదేండ్లపాటు 1.3 కోట్ల లైట్ ఎక్స్‌‌‌‌పోజర్ డేటాను సేకరించారు. 

ఫలితాలను విశ్లేషించగా.. రాత్రిపూట లైట్ల వెలుతురులో ఎక్కువగా ఉండటం గుండెకు చాలా ప్రమాదమని తేలింది. లైట్ల కాంతి మనమీద పడటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 56%, గుండెపోటు రిస్క్ 47%, కరోనరీ ఆర్టరీ డిసీస్ రిస్క్ 32%, హార్ట్ స్ట్రోక్ రిస్క్28% పెరుగుతుందని వెల్లడైంది. 

బాడీ క్లాక్ లో గందరగోళం వల్లే సమస్య

రాత్రిపూట లైట్ల వెలుతురులో ఉండటం వల్ల మన శరీర జీవగడియారం(బయాలజికల్ క్లాక్) గందరగోళానికి గురవడం వల్లే హార్ట్ కు రిస్క్ పెరుగుతోందని స్టడీలో గుర్తించారు. రోజూ మనం ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొవాలి? ఎప్పుడు తినాలి? వంటివి నిర్ణయించే ఈ బాడీ క్లాక్ అస్తవ్యస్తం కాకూడదంటే.. రాత్రిపూట బ్లాక్‌‌‌‌అవుట్ కర్టెన్లు, డిమ్ లైట్లను వాడటం, నిద్రకు ముందు ఫోన్‌‌‌‌ చూడకపోవడం వంటివి పాటించాలని చెప్తున్నారు.  షెడ్యూల్ ప్రకారం నిద్రతోపాటు ఉదయం సూర్యకాంతి చూడటంవల్ల  బాడీ క్లాక్ మెరుగవుతుందని అంటున్నారు.