వేరే జబ్బులతో పాజిటివ్ వచ్చి చనిపోతే కరోనా లెక్కల్లోకి రారు

వేరే జబ్బులతో పాజిటివ్ వచ్చి చనిపోతే కరోనా లెక్కల్లోకి రారు

ప్రతీ చావును కరోనా ఖాతాలోనే వేయాలంటే ఎట్లా అని మంత్రి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. పలు రకాల కారణాలతోనే దేశంలో రోజూ 30 వేల మంది దాకా, రాష్ట్రంలో వెయ్యిమంది దాకా చనిపోతుంటారని ఆయన చెప్పారు. వీరిలో దీర్ఘకాలిక జబ్బులు, క్యాన్సర్ ,డయాలసిస్ వంటి పేషెంట్లు కూడా ఉంటారని, వారు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతే కరోనా మరణాలుగా చూపాలనడంలో అర్థం లేదన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కరోనాతో చనిపోతే దాన్ని కరోనా మరణంగా చూప వచ్చని చెప్పారు. అన్ని మరణాలను కరోనా ఖాతాలో వేయాలని కొందరు అంటున్నారని, అది కరెక్ట్ కాదన్నారు. కామారెడ్డి జిల్లాలో సీజనల్ జబ్బులపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. కొందరు కష్టకాలంలో రాజకీయం చేస్తున్నారన్నారు.అది బాధాకరమనానారు. డాక్టర్లు, స్టాఫ్ ఆశకార్యకర్తలు,శానిటేషన్ సిబ్బంది, వీరంత మరుగైన సేవలు అందిస్తున్నారని, వారి  మనోధైర్యరం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదన్నారు.

దేశానికే మార్గం చూపించినం

కరోనా వ్యాప్తి చెందుతున్న టైంలోనే కంటెయిన్ మెంట్లు ఏర్పాటు చేసి దేశానికి మార్గం చూపిన ఘనత తెలంగాణదని అన్నారు. కరోనా ట్రీట్ మెంట్ కోసం ఎన్ని నిధులైనా ఇస్తానని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ట్రీట్ మెంట్ లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.