Good Health : ఇలాంటి వ్యాయామం చేస్తే కాళ్లకు బలం వస్తుంది

Good Health : ఇలాంటి వ్యాయామం చేస్తే కాళ్లకు బలం వస్తుంది

కాళ్లలో పటుత్వం లేకపోతే వేగంగా నడవలేరు. ఎక్కువసేపు నిల్చోలేరు. ఎక్కువ దూరం పరుగెత్త లేరు. అందుకే, కొన్ని వ్యాయామాలు రోజూ చేస్తే కాళ్లదృఢత్వం పెరుగుతుంది.

ప్లీ వ్యాయామం

నిటారుగా నిలబడి కుడి చేత్తో రెయిలింగ్ రాడ్ లేదా అందుబాటులో ఉండే కిటికీ ఊచ లాంటిది పట్టుకోవాలి. తర్వాత రెండు కాళ్లను దగ్గరకు తీసుకురావాలి. పాదాలు కుడి, ఎడమ వైపు తిప్పాలి. ఎడమ చేతిని దాన్సింగ్ పొజిషన్లో తిప్పుతూ రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర వెడల్పు చేస్తూ కుడి, ఎడమలకు వంచాలి. ఇలా నెమ్మదిగా కాకుండా కొద్దిగా వేగంగా చెయ్యాలి. మూడుసార్లు చేశాక రెండు కాళ్లను కొంచెం దూరం జరిపి మళ్లీ అదే వ్యాయామం ఐదు నిమిషాలు చెయ్యాలి. ఈ వ్యాయామం వల్ల మోకాళ్లకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, తొడలకు బలం వస్తుంది. మడమలు కూడా గట్టి పడతాయి.

సింగిల్ సర్కిల్

నేలపై కార్పెట్ పరిచి దాని పై వెల్లకిలా పడుకోవాలి. తర్వాత కుడి కాలు పైకి లేపి నిటారుగా పెట్టి ఎడమ వైపుకి తిప్పాలి. తర్వాత కాలు గుండ్రంగా తిప్పి కిందికి నిటారుగా పెట్టాలి. అలా కుడి ఎడమ కాళ్లను ఒక్కొక్కటిగా గుండ్రంగా తిప్పాలి. ఇలా పదినిమిషాలు చెయ్యాలి. ఈ వ్యాయామం వల్ల కీళ్లు ఏటంటే అటు వంగుతాయి. స్వా నేలపై నిలబడి కాళ్లు 90 డిగ్రీస్ సమానంగా డివైపుకు ఎడమవైపుకు జరపాలి. తర్వాత కుర్చీలో కూర్చున్నట్లుగా పొజిషన్ తీసుకోవాలి. అలా చేసేటప్పుడు చేతులను మోకాళ్లు సమాంతరంగా పెట్టాలి. అలా నెమ్మదిగా పైకి లేవాలి. ఇలా ఐదు నిమిషాలు చెయ్యాలి.. స్క్వాట్స్ ఎక్సర్ సైజ్ వల్ల పిరుదులు, తొడలు దృఢమవుతాయి.

లంగ్ విత్ వెయిట్స్

చేతులతోడంబెల్స్ పట్టుకుని నిటారుగా నిలబడాలి. కుడి కాలుని కొద్దిగా ముందుకి చాపాలి. తర్వాత ఎడమ కాలిని కొద్దిగా వెనక్కి చాపాలి. ఫొటోలో చూపినట్లు ఎడమ కాలి మోకాలు నేలకు ఆనిస్తూ కిందికి పెట్టాలి. అలాగే వెంటనే నిటారుగా లేవాలి. అలా రెండు కాళ్లతో పది నిమిషాలు చెయ్యాలి. ఈ వ్యాయామం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు రావు, కాళ్లలో బలం పెరుగుతుంది.

Also Read: రామగిరి గుట్టలు.. ప్రకృతి సిరి.. చూసొద్దామా సరదాగా