Good Health : ఇలా యోగా చేస్తే ఒత్తిడి, టెన్షన్ దూరం

Good Health : ఇలా యోగా చేస్తే ఒత్తిడి, టెన్షన్ దూరం

యోగాలో వివిధ రకాల పద్ధతులను మరింత కాన్ సన్ ట్రేషన్ చేస్తూ, మైండ్ ను కంట్రోల్ చేసే పద్ధతుల్లో హార్టఫుల్ నెస్ యోగ. దీన్నే హార్టేబేస్డ్ యోగ అని కూడా అంటారు. నిద్ర లేమీ, ఒత్తిడిని జయించడంలో హార్ట్ఫుల్ నెస్ యోగ రోల్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం.. 

ఫ్యామిలీ ప్రబ్లమ్స్, పని ప్రభావం, ఇతర సమస్యలతో సతమతమవుతున్న టైంలో చాలామంది ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దాని నుంచి బయటపడటానికి హార్ట్ ఫుల్ నెస్ యోగ ఎంతో అవసరపడుతుందని తేల్చింది. ఈ సర్వేను మన హైదరాబాద్ లోనే చేసి వివరాలు వెల్లడించారు. చాలామంది యోగా ప్రాక్టీసును కొనసాగిస్తుంటారు. 

ఫెసిలిటీస్, టెక్నాలజీ ఉన్నప్పటికీ నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, ‘హార్టఫుల్ మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గి, నిద్ర పడుతుందని ఆ సంస్థ తెలిపింది. 8 వారాల పాటు సాగిన ఈ సర్వేలో 63 మంది పాల్గొన్నారు. వీరిలో (57 శాతం) హార్టుల్ యోగా సర్వేను పూర్తి చేశారు.