బయటకు వెళ్లినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తే...

బయటకు వెళ్లినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తే...

జిడ్డు చర్మం, పొడి చర్మం సమస్య ఉన్నవాళ్లు బయటకు వెళ్లినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాగ్‌‌లో ఫేస్ వైప్స్ ఉంటే ముఖాన్ని ఇన్‌‌స్టంట్‌‌గా క్లీన్ చేసుకోవచ్చు. 

  • పొడి చర్మాన్ని తేమగా మార్చడానికి, జిడ్డు చర్మాన్ని పొడిగా మార్చడానికి ఫేస్ వైప్స్ బాగా పనికొస్తాయి. 
  • ఫేస్ వైప్స్​ పర్‌‌ఫ్యూమ్‌‌గా కూడా పనికొస్తాయి. ఎప్పుడైనా పర్‌‌ఫ్యూమ్‌‌ వాడడం మర్చిపోయినప్పుడు శరీరం నుంచి చెమట వాసన రాకుండా ఫేస్‌‌ వైప్స్‌‌తో క్లీన్ చేసుకోవచ్చు.
  • మేకప్‌‌ తొలగించడానికి కూడా ఫేస్‌‌వైప్స్‌‌ వాడొచ్చు. ఫేస్‌‌ వైప్స్‌‌తో రుద్దితే ఎలాంటి మేకప్ అయినా తొందరగా వచ్చేస్తుంది.
  • వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి ఎక్కువ చెమట పడుతుంటుంది. అలాంటప్పుడు ఫేస్ వైప్స్‌‌తో తుడుచుకుంటే చాలు.   
  • ఫేస్ వైప్స్‌‌లో ఆయిల్ కంట్రోల్, విటమిన్ బేస్డ్, మాయిశ్చరైజింగ్.. ఇలా చాలా రకాలున్నాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌‌గా ఉంచడానికి,  పింపుల్స్‌‌ను తొల‌‌గించడానికి  కూడా ఫేస్ వైప్స్ వాడొచ్చు.