పార్టీ మారినట్లు నిరూపిస్తే రూ. 11 లక్షలు ఇస్తా

  • బీఆర్ఎస్ లీడర్​  శ్రీనివాస్ యాదవ్ సవాల్

బషీర్ బాగ్, వెలుగు: తాను పార్టీ మారానంటూ సొంత పార్టీ లీడర్లే దుష్ప్రచారం చేస్తున్నారని గోషామహల్ బీఆర్ఎస్ లీడర్, హైదరాబాద్ కంటెస్టడ్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ గౌలిగూడలో ఆదివారం ఆయన మాట్లాడారు. తాను వేరే పార్టీలో చేరినట్లు ప్రచారం చేస్తున్నారని, నిరూపిస్తే రూ. 11 లక్షలు ఇస్తానని సవాల్​విసిరారు. వేరే పార్టీ కండువా కప్పుకున్నట్లు ఒక్క ఆధారం అయినా చూపించి  రూ. 11 లక్షల చెక్కును తీసుకోవాలని స్పష్టం చేశారు.