చెప్పకుండా జాబ్‌‌‌‌ మానేస్తే మీకే నష్టం!

V6 Velugu Posted on Dec 04, 2021

  • తీర్పిచ్చిన ఏఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • శాలరీపై 18 శాతం వరకు ఉండే ఛాన్స్‌‌‌‌‌‌‌‌
  • వచ్చే ఏడాదిలోపు పూర్తి స్థాయిలో జాబ్ డేటా

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జాబ్‌‌‌‌‌‌‌‌ మానేయాలనుకుంటున్నారా? తప్పులేదు. కానీ, నోటీస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లో పనిచేయకుండా సడెన్‌‌‌‌‌‌‌‌గా మానేస్తే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే.  అథారిటీ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ రూలింగ్‌‌‌‌‌‌‌‌ (ఏఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఇటువంటి ఉద్యోగుల జాబ్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌పై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేయొచ్చని  తీర్పిచ్చింది. జాబ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నప్పుడు కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను ఇస్తాయి.  గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, టెలిఫోన్ రీఛార్జ్‌‌‌‌‌‌‌‌లు, నోటీస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చే శాలరీ వంటివి ఇస్తుంటాయి. కానీ, నోటీస్ ఇవ్వకపోతే మాత్రం ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌కు చెల్లించే శాలరీలో కొన్ని ఖర్చులను కట్ చేస్తాయి. అంటే టెలిఫోన్ బిల్లులు, గ్రూప్ ఇన్సూరెన్స్ ఖర్చులు వంటివి. వీటిపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేయొచ్చని ఏఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. సింపుల్‌‌‌‌‌‌‌‌గా చెప్పాలంటే నోటీస్‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా మానేస్తే, ఉద్యోగికి చెల్లించే మంత్లీ శాలరీపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేయడానికి వీలుంటుంది. కాగా,  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ చట్టం ప్రకారం, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగికి చెల్లించే శాలరీలపై ఎటువంటి జీఎస్‌‌‌‌‌‌‌‌టీ ఉండదు.  నోటీస్‌ పీరియడ్‌ ఇవ్వకుండా మానేస్తే ఉద్యోగులపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వసూలు చేసే బాధ్యత ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉంటుంది.  రివర్స్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌ మెకానిజం (కంపెనీలపై కాకుండా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగిపై)  ద్వారా ఉద్యోగి రికవరీలపై  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేస్తారు.  అంటే నోటీస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లో పనిచేయకపోతే  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కట్టమని ఉద్యోగిని ఎంప్లాయర్ అడగొచ్చని ట్యాక్స్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ బల్వంత్‌‌‌‌‌‌‌‌ జైన్ అన్నారు. ఈ జీఎస్‌‌‌‌‌‌‌‌టీ 18 శాతం ఉండొచ్చని చెప్పారు. సాధారణంగా నోటీస్ పీరియడ్‌‌‌‌‌‌‌‌  నెల నుంచి మూడు నెలల వరకు ఉంటోంది. 

జాబ్ డేటాపై ఫుల్‌‌‌‌‌‌‌‌ కసరత్తు..
ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న వర్కర్ల  డేటాను ప్రభుత్వం వేగంగా సేకరిస్తోంది. జాబ్‌‌‌‌‌‌‌‌ డేటా చేతిలో ఉంటే  ఉద్యోగాలను క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేయడంలో సరియైన పాలసీలను తీసుకోవడానికి వీలుంటుందని భావిస్తోంది. ఈ జాబ్‌‌‌‌‌‌‌‌ డేటాను వలస కూలీలను, లేబరర్లను సర్వే చేయడం ద్వారా సేకరిస్తోంది. దీనికి తోడు కొత్తగా తెచ్చిన ఈ–శ్రమ్‌‌‌‌‌‌‌‌ పోర్టల్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం సేకరిస్తోంది. కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో  వేల మంది వలస కూలీలు తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో చాలా సిటీలలో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. ప్రభుత్వ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు కూడా సరిగ్గా జరగలేదు. ఈ సంఘటన తర్వాత వర్కర్ల ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను సేకరించడం చాలా కీలకంగా మారిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాకు కాలం చెల్లిందని చెబుతున్నారు. సర్వే ద్వారా సేకరించిన జాబ్‌‌‌‌‌‌‌‌ డేటాపై  ఆధారపడాలని ఆర్థిక వేత్తలు  ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ–శ్రమ్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఓ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్లు 10 కోట్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేశాయి. మరో 28 కోట్ల మంది లేబర్లు రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న వారిలో మెజార్టీ ఉద్యోగుల డేటా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంటోంది. రిటైర్ మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పాలసీల  వలన వీరి డేటా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు తమ వర్కర్లకు సంబంధించిన మరిన్ని డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ను సేకరించాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది కూడా. కానీ, ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వర్కర్ల డేటాను సేకరించడంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాదిలో లోపు ఈ  సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మొత్తం  లేబరర్లు, వర్కర్ల డేటాను సేకరించాలని గవర్నమెంట్ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.

Tagged business, GST, Job, resign, job loss, Authority of advance ruling, job notice period

Latest Videos

Subscribe Now

More News