నిమ్మలంగా నడిస్తే వేగంగా ముసలితనం

నిమ్మలంగా నడిస్తే వేగంగా ముసలితనం

నిదానమే ప్రధానం అని అప్పట్లో పెద్దోళ్లు చెప్పేటోళ్లు. స్లో అండ్​ స్టడీ విన్స్​ ద రేస్​ అని ఇంగ్లిష్​లో నానుడి. కానీ, ఇప్పుడు సైంటిస్టులు మాత్రం రివర్స్​ చెప్తున్నరు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నడవమంటున్నరు. అవును, నలభై ఏళ్లు వచ్చాక నిదానంగా నడిస్తే తొందరగా ముసలి వాళ్లు అయిపోతారని అంటున్నారు. ఎంత వేగంగా నడిస్తే అంత యవ్వనంగా ఉంటారని చెబుతున్నారు. లండన్​లోని కింగ్స్​ కాలేజీ, అమెరికాలోని డ్యూక్స్​ యూనివర్సిటీ సైంటిస్టులు కలిసి రీసెర్చ్​ చేసి ఈ విషయం చెబుతున్నారు. 45 ఏళ్ల వయసున్న వారిపై ఈ రీసెర్చ్​ చేశారు. ఈ వయసులోని వాళ్లు సగటున సెకనుకు 2 మీటర్ల వేగంతో నడుస్తున్నారని తేల్చారు.

తక్కువ వేగంతో నడిచే వారు త్వరగా ముసలి వాళ్లు అవుతున్నారని, వాళ్ల ఊపిరితిత్తులు, పళ్లు, రోగనిరోధక వ్యవస్థ, శరీరంలోని అవయవాలు బలహీనంగా మారుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాకుండా వాళ్ల మెదళ్లు కూడా వయసు పైబడుతున్నాయని తేల్చారు. నిదానంగా నడిచే వాళ్లకు పుట్టే పిల్లల ఐక్యూ (తెలివి) కూడా, వేగంగా నడిచే వారికి పుట్టే పిల్లలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.