తగ్గేదే లేదు..ఎన్నికలు కావాలంటే రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే

తగ్గేదే లేదు..ఎన్నికలు కావాలంటే రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే

ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న ఎజెండాను విజయవంతం చేయడానికి BJPకి 70 ఏళ్లు పట్టిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఓమర్ అబ్దుల్లా. తిరిగి  ఆర్టికల్ 370ని తెచ్చేందుకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అందుకు ఎంతకాలం పట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే మాటను మహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారన్నారు. డిలిమిటేషన్, స్టేట్ హుడ్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రధాని మోడీతో సమావేశం మంచి విషయమన్నారు ఫరూఖ్ అబ్దుల్లా. అన్ని పార్టీలు మోడీకి తమ ఎజెండాను వివరించాయన్నారు. జమ్ము కశ్మీర్ లో మంచి పరిస్థితులను నిర్మించేందుకు ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అన్నారు.