రివిజన్​తో రీజనింగ్​లో టాప్​ స్కోర్​

రివిజన్​తో రీజనింగ్​లో టాప్​ స్కోర్​

తెలంగాణలో విడుదలైన పోలీస్​ నోటిఫికేషన్లతో పాటు గ్రూప్​ 1 లో ముఖ్యమైన సబ్జెక్ట్​ అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్. ముఖ్యంగా ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్షలో సగం మార్కులు ఇందులో నుంచే అడుగుతారు. రీజనింగ్​లో ఎక్కువ స్కోర్​ చేయాలంటే టాపిక్స్​ను రివిజన్​ చేస్తూ ప్రాక్టీస్​ చేయాల్సిందే. గ్రూప్​ 1 ప్రిలిమ్స్​లో 15 నుంచి 20 మార్కులు, మెయిన్స్​ పేపర్​ 5లో 50 మార్కులు ఇందులో నుంచే వస్తాయి. సిలబస్​లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ముఖ్యమైన అంశాలు ఎలా ప్రాక్టీస్​ చేయాలో తెలుసుకుందాం.. 

లాజికల్​ రీజనింగ్​ సంబంధించి మార్కెట్లో​ లభ్యమయ్యే పుస్తకాల్లో వెర్బల్​, నాన్​వెర్బల్, లాజికల్​ రీజనింగ్​ 3 రకాల సిలబస్​ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన గత పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల సరళిని చూస్తే లాజికల్​ రీజనింగ్​ విభాగంలో వెర్బల్​ రీజనింగ్​ ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. వీటితో పాటు అభ్యర్థులు నాన్​ వెర్బల్​ చాప్టర్లను కూడా ప్రిపేర్​ కావాలి. వెర్బల్​ రీజనింగ్​లో భాగమైన కోడింగ్​, డీకోడింగ్​ వరుస క్రమ పరీక్ష, మిస్సింగ్​ క్యారెక్టర్స్​​, హ్యూమన్​ రిలేషన్​షిప్స్​, క్యాలెండర్​, భిన్న పరీక్ష, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​, మొదలగు చాప్టర్​లు ప్రిపేర్​ కావాలి. 

లాజికల్​ రీజనింగ్​ టిప్స్​

కోడింగ్​, డీకోడింగ్​ చేయడానికి A---Z, Z---A వాటి యొక్క స్థానం తెలిసి ఉండాలి. ఉదా: A=1, M=13 వ్యతిరేక క్రమంలో A---Z, I---R , J---Q. వరుస క్రమ పరీక్ష, భిన్న పరీక్ష చేయడానికి 1 నుంచి 25 వరకు వర్గములు, ఘనములు, నోటెడ్​ ఉండాలి. తద్వారా పరీక్షలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలం. రూల్​ క్యాలెండర్​ చాప్టర్​ షార్ట్​కట్స్​ కోడ్​లు గుర్తుంచుకోవాలి.  రక్త సంబంధాలు, దిశలు తెలిసి ఉండాలి. గతంలో పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చూసి అదే మోడల్​ ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి. 

అనలిటికల్​ ఎబిలిటీ

ఈ విభాగంలో అనలిటికల్​ రీజనింగ్​ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ప్రశ్నలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. కాంపిటేటీవ్​ పరీక్షలకు నూతనంగా సన్నద్ధులయ్యే వారికి కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ నిరంతర సాధన చేస్తే తేలికగా జవాబులు గుర్తించవచ్చు.  అనలిటికల్​ ఎబిలిటీలో ప్రకటనలు–ఊహలు, ప్రకటనలు–తీర్మానాలు, జడ్జిమెంట్​, నిశ్చితం–కారణం, ప్రకటనలు–పర్యవసానాలు లాంటి టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

డేటా ఇంటర్​ ప్రిటేషన్

డేటా ఇంటర్​ప్రిటేషన్​లో భాగంగా టేబుల్స్​, బార్​గ్రాఫ్స్​, పైచార్ట్స్​, లైన్​ గ్రాఫ్స్​ రూపంలో సమాచారం ఇచ్చి వాటి ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ భాగంలో అభ్యర్థి డేటా విశ్లేషణ, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. డేటా విశ్లేషణలో భాగంగా స్టాటిస్టికల్ డేటా టేబుల్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్​లు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి ఇచ్చిన డేటాను క్షుణ్నంగా అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

సిలబస్​రీజనింగ్​ ఎబిలిటీ

ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్‌‌ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్‍ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్‌‌ ప్రాక్టీస్​ చేయాలి. సీటింగ్​ అరేంజ్​మెంట్​, పజిల్​ టెస్ట్​, స్టేట్​మెంట్స్​ అండ్​ కన్​క్లూజన్స్, కోడింగ్​–డీకోడింగ్​, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా టాపిక్​ల్లో ఉన్న అన్ని మోడల్స్​, మెథడ్స్​ చదవాలి. వీటితో  పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్‍ టెస్ట్, ర్యాంకింగ్‍ టెస్ట్ వంటి వర్బల్‍ రీజనింగ్‍ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్‌‌ ఆఫ్‌‌ యాక్షన్, ఇన్‌‌పుట్, అవుట్‌‌పుట్, కాజ్‌‌ అండ్​ ఎఫెక్ట్, స్టేట్‌‌మెంట్‌‌-ఇన్‌‌ఫరెన్స్​, మిర్రర్‍ ఇమేజస్‍, వాటర్‍ ఇమేజస్‍, పేపర్‍ ఫోల్డింగ్‍, పేపర్‍ కట్టింగ్‍, ప్యాటర్న్ కంప్లీషన్‍, ఎంబెడ్డెడ్‍ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ అంశాలు ప్రాక్టీస్‍ చేయాలి. 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్​

ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన సబ్జెక్ట్​ ప్రిపరేషన్​ సమయంలో ఫార్మూలాలు, షార్ట్‌‌కట్స్ రాసుకొని సాధన చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్​ చేయచ్చు. ఈ విభాగంలో గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్​ సిరీస్​, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్​ప్రిటేషన్​, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్​, ఆర్థమెటిక్​ టాపిక్​ల నుంచి ప్రశ్నలిచ్చారు. కాబట్టి వీటిపై ఫోకస్​ చేయడం ఎంతో అవసరం. అర్థమెటిక్‍ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్‍ సిరీస్‍, నంబర్‍ సిస్టం,  సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్‍ క్యూబ్స్, డెసిమల్‍ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్‍ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్‌‌ చదవాలి.

పుస్తకాలు: పాఠశాల స్థాయి గణిత పుస్తకాల్లోని ఈ అంశాలను చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్‌‌‌‌ల్లో వివిధ పబ్లికేషన్ల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి తీసుకుని సంబంధిత అంశాలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. స్టాండర్డ్​ బుక్​ తీసుకొని దాన్నే అనేక సార్లు రివిజన్​ చేస్తే ఎక్కువ స్కోర్​ చేయవచ్చు. 

ఇలా చదివితే ఈజీ 

జనరల్‌‌‌‌ మెంటల్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్‌‌‌‌ విభాగంలో ప్రతి పరీక్షలో తగిన ప్రాధాన్యం ఉంటోంది. ఈ విభాగంలో రాణించాలంటే.. నంబర్‌‌‌‌ సిరీస్, రీజనింగ్, కోడింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ డీ కోడింగ్, ఇన్ఫరెన్సెస్, సగటు, శాతాలు, నిష్పత్తి, గడియారాలు, క్యాలెండర్, అరేంజ్‌‌‌‌మెంట్స్, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, నంబర్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్‌‌‌‌ విషయంలో ప్రాక్టీస్‌‌‌‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం టేబుల్స్, బార్‌‌‌‌ డయా గ్రామ్స్, పై డయాగ్రామ్స్, గ్రాఫ్స్‌‌‌‌పై ఎక్కువ దష్టి పెట్టాలి. స్క్వేర్‌‌‌‌ రూట్స్, క్యూబ్‌‌‌‌ రూట్స్, ప్రై మ్‌‌‌‌ నంబర్స్, నంబర్‌‌‌‌ అనాలజీ క్లాసిఫికేషన్‌‌‌‌లపై పట్టు సాధించాలి. ఇలా ప్రతి టాపిక్‌‌‌‌కు సంబంధించి వెయిటేజీకి అనుగుణంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌‌‌‌ సాగించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

పోలీస్​ ఉద్యోగాలకు ఇదే కీలకం

పోలీస్‌‌‌‌ సెలెక్షన్​ ప్రాసెస్​లో కీలకమైంది అర్థమెటిక్‌‌‌‌ అండ్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌. ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌‌‌‌ పోస్టులకు సంబంధించి సిలబస్‌‌‌‌ దాదాపు ఒకటే. ప్రిలిమ్స్​ రాతపరీక్షకు సంబంధించిన 200 మార్కుల్లో ఈ సబ్జెక్ట్‌‌‌‌ నుంచి 100 మార్కులుంటాయి. మెయిన్స్‌‌‌‌కు  ఎస్సై పోస్టులకు 400 (కానిస్టేబుల్‌‌‌‌ పోస్టులకు 200) మార్కుల్లో సగం ఈ సబ్జెక్ట్‌‌‌‌వే. మిగిలిన సగం జనరల్‌‌‌‌ సైన్స్‌‌‌‌కు సంబంధించినవి. మెయిన్స్‌‌‌‌లో 65 శాతానికిపైగా మార్కులొస్తే ఉద్యోగం దక్కే అవకాశముంది. ఈ సబ్జెక్టులో మూడొంతులు, జనరల్‌‌‌‌ సైన్స్‌‌‌‌లో సగం మార్కులు సాధిస్తే కొలువుకు దగ్గరైనట్లే. రాతపరీక్షకు సంబంధించి అర్థమెటిక్‌‌‌‌లో 10- నుంచి 15, రీజనింగ్‌‌‌‌లో 20వరకు టాపిక్స్‌‌‌‌ ఉంటాయి. వీటిని 5 నుంచి -6 సార్లు రివిజన్​ చేయాలి. డైలీ ప్రాక్టీస్​లో సగం సమయం ఈ సబ్జెక్ట్‌‌‌‌కే కేటాయించాలి. మాక్ టెస్టులతో పాటు గ్రాండ్​ టెస్టులు  వీలైనన్ని ఎక్కువసార్లు రాయాలి. దీంతో మెయిన్స్‌‌‌‌ పరీక్షలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది.