టూ స్టెప్ వెరిఫికేషన్ కావాలంటే.. డబ్బులు కట్టాల్సిందే

టూ స్టెప్ వెరిఫికేషన్ కావాలంటే.. డబ్బులు కట్టాల్సిందే

ట్విట్టర్ మరొక అప్ గ్రేడ్ ని తీసుకొచ్చింది. టూ స్టెన్ వెరిఫికేషన్ కావాలంటే పేమెంట్ చేయాలని ప్రకటించింది. టూ ఫాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ) ద్వారా సెక్యూరిటీ ఫీచర్ పొందొచ్చు. దీంతో ట్విట్టర్ అకౌంట్ ని హ్యాకర్ల నుంచి సేఫ్ గా, సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడానికి పాస్‌వర్డ్, కోడ్ లేదా సెక్యూరిటీ కీని నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీన్ని మార్చుతూ కొత్త నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు 2ఎఫ్ఏ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ టూ స్టెప్ వెరిఫికేషన్ కావాలనుకుంటే నెల లేదా సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్ మార్చి 20 నుంచి అమలులోకి వస్తుంది. 

ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ కావాలంటే.. నెలకు రూ.650 చెల్లించాలి అంటే నెలవారి ప్లాన్ ద్వారా ట్విట్టర్ కు సంవత్సరానికి రూ.7,800 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆన్యువల్ ప్లాన్ తీసుకుంటే.. రూ.6,800 పడుతుంది. అంటే ఈ ప్లాన్ ద్వారా నెలకు రూ.566 ఖర్చు చేసినట్లు అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా ట్విట్టర్ బ్లూ వినియోగదారుల ట్వీట్లు అన్ని ట్వీట్ల కంటే ముందు కనిపిస్తాయి. యాడ్స్ ఫ్రీ పోస్టులు చూడొచ్చు. 1080p లో వీడియోలు అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు తీసుకొచ్చిన టూ స్టెప్ వెరిఫికేషన్ ని కూడా ఫ్రీగా పొందొచ్చు.