
న్యూఢిల్లీ: పారిశ్రామిక మౌలిక సదుపాయాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలకు సరికొత్త పరిష్కారాలను అందించడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 22–24 తేదీల్లో దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ వాటర్, సీవేజ్, వేస్ట్ అండ్ రా మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ (ఐఎఫ్ఏటీ) ఎగ్జిబిషన్ జరుగనుంది.
దాదాపు 60 సంవత్సరాలుగా, పర్యావరణ ఆవిష్కరణలకు ఐఎఫ్ఏటీ వేదికగా పనిచేస్తోంది. నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌పై ఈ సదస్సు దృష్టి పెడుతుంది. పర్యావరణ రంగం నిపుణులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ అధికారులు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలపై చర్చిస్తారు.