నెం.1 కో‑ఆపరేటివ్​సంస్థగా ఇఫ్కో

నెం.1 కో‑ఆపరేటివ్​సంస్థగా ఇఫ్కో

హైదరాబాద్​, వెలుగు: ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) మరోసారి ప్రపంచవ్యాప్తంగా 300  అగ్రశ్రేణి సహకార సంస్థలలో నంబర్ వన్ కో–ఆపరేటివ్ సంస్థగా ప్రతిష్టాత్మక బిరుదును పొందింది. దేశ జీడీపీ ఆర్థిక వృద్ధికి ఇఫ్కో గణనీయంగా తోడ్పాటును ఇస్తోంది సంస్థ తెలిపింది.   తలసరి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై టర్నోవర్ నిష్పత్తి ఆధారంగా ఈ బిరుదును ఇచ్చారు. 

 ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ అలయన్స్  ప్రచురించిన 12వ వార్షిక వరల్డ్ కో–ఆపరేటివ్ మానిటర్  రిపోర్ట్​ ప్రకారం..ఇఫ్కో మొత్తం టర్నోవర్ ర్యాంకింగ్‌‌లో 72వ స్థానానికి చేరుకుంది. గతంలో 97వ స్థానంలో ఉంది. సంస్థకు 35,500- సభ్యుల సహకార సంఘాలు ఉన్నాయి.