ఐజీఎఫ్‌‌ఆర్‌‌ వరల్డ్‌‌ గోల్ఫ్‌‌ చాంపియన్‌‌షిప్‌: నేషన్స్‌‌ కప్‌‌ విజేత ఇండియా

ఐజీఎఫ్‌‌ఆర్‌‌ వరల్డ్‌‌ గోల్ఫ్‌‌ చాంపియన్‌‌షిప్‌: నేషన్స్‌‌ కప్‌‌ విజేత ఇండియా

హైదరాబాద్‌‌: ఐజీఎఫ్‌‌ఆర్‌‌ వరల్డ్‌‌ గోల్ఫ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా నేషన్స్‌‌ కప్‌‌ను గెలుచుకుంది. శుక్రవారం ముగిసిన పోటీల్లో ఇండియా గోల్ఫర్లు ముకేశ్‌‌ సాంగ్వి (105), సాజన్‌‌ కుమార్‌‌ జైన్‌‌ (100), అశోక్‌‌ దొరైస్వామి (99) అద్భుతంగా ఆడారు. హువాంగ్‌‌ యు చువాన్‌‌ (86), లిన్‌‌ షిహ్‌‌ వెన్‌‌ (86), చెన్‌‌ షున్‌‌ చిహ్‌‌ (94)తో కూడిన తైవాన్‌‌ బృందం తొలి రన్నరప్‌‌గా నిలిచింది. 

నికోలా ట్రాక్చియా (90), టీనా ఒల్లెరిచ్‌‌ (76), స్టీఫెన్‌‌ సోమర్‌‌ (85)తో కూడిన స్విట్జర్లాండ్‌‌ టీమ్‌‌కు రెండో రన్నరప్‌‌ లభించింది. రొటేరియన్‌‌ డివిజన్‌‌–1లో హిరానీ జితేంద్ర (107) విన్నర్‌‌గా నిలిచాడు. తైసాయ్‌‌ చియ్‌‌ హో (100), తోహెర్‌‌ టిలీ (89) తర్వాతి ప్లేస్‌‌లను సాధించారు.

రొటేరియన్‌‌ డివిజన్‌‌–2లో వార్గుసి రూబెన్‌‌ (114), హుయాంగ్‌‌ సుజ్లిన్‌‌ (98), కుండు డాక్టర్‌‌ సంజయ్‌‌ (90) విజేతలుగా నిలిచారు. వెటరన్స్‌‌ డివిజన్‌‌లో గిబ్సన్‌‌ పీటర్‌‌ (98), రాతురి డాక్టర్‌‌ భరత్‌‌ మోహన్‌‌ (98), ట్రాచియా నికోలా (90) ట్రోఫీలను గెలుచుకున్నారు. ఓపెన్‌‌ డివిజన్‌‌–1లో రిన్నెర్‌‌ అలోసిస్‌‌ (247), సింగ్ అనుజ్‌‌ మోహన్‌‌ (248), కెంఫో క్రిస్టోఫ్‌‌ (252), డివిజన్‌‌–2లో సాంగ్వి ముకేశ్‌‌ (105), అశోక్‌‌ దొరైస్వామి (99), మజుందార్‌‌ మహ్మద్‌‌ నసిముల్‌‌ హక్‌‌ (99), డివిజన్‌‌–3లో జైన్‌‌ సాజన్‌‌ కుమార్‌‌ (100), అమర్‌‌నాథ్‌‌ (98), జైప్రకాశ్‌‌ శర్మ (92) చాంపియన్లుగా నిలిచారు.