
ముంబై: ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 100 మిలియన్ డాలర్ల వరకు -నిధులను పొందింది. హెచ్ఎఫ్ఎల్ ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), తక్కువ-ఆదాయ వర్గాలకు (లో ఇన్కమ్ గ్రూప్స్), మహిళలకు లోన్లు ఇవ్వడానికి ఈ -నిధులను వాడుతుంది.
హోమ్ ఫైనాన్స్‌ను పెంచడంలో ఇవి సహాయపడతాయి. ఒప్పందం ప్రకారం, మహిళలకు హౌసింగ్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడానికి 50 శాతం నిధులు కేటాయిస్తారు.