ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సమస్త బాండ్లపై 10.50 శాతం వడ్డీ

ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సమస్త బాండ్లపై 10.50 శాతం వడ్డీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నాన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ సమస్త  ఎన్‌‌‌‌‌‌‌‌సీడీ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.1000 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 15 వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. 60 నెలల కాల పరిమితితో బాండ్లను తీసుకుంటే 10.50 శాతం వడ్డీ పొందొచ్చు. 24 నెలలు, 36 నెలల టైమ్‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌తో కూడా బాండ్లు అందుబాటులో ఉన్నాయి. వడ్డీ చెల్లింపులు నెల వారీగాను, యాన్యువల్ గాను చేస్తామని వెల్లడించింది. తమకు క్రిసిల్‌‌‌‌‌‌‌‌ ఏఏ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనస్‌‌‌‌‌‌‌‌ రేటింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిందని, అకుటే ఏఏ స్టేబుల్ రేటింగ్ ఇచ్చిందని ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ సమస్త హెడ్‌‌‌‌‌‌‌‌ (ట్రెజరీ)  మోహన్ కుమార్ వెల్లడించారు. 

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను బిజినెస్ విస్తరించడానికి వాడతామని చెప్పారు. ప్రస్తుతం తమకు దేశం మొత్తం మీద 1,500  బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో 57 బ్రాంచులు ఉన్నాయని అన్నారు. తాజా ఇష్యూలో మొదట రూ.200 కోట్లు సేకరిస్తామని, ఓవర్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ సాధిస్తే అదనంగా మరో రూ.800 కోట్లు సేకరిస్తామని కంపెనీ పేర్కొంది.  తాజా పబ్లిక్ ఇష్యూలో బాండ్ల ఫేస్‌‌‌‌‌‌‌‌ వాల్యూ రూ.1,000. ఇన్వెస్టర్లు కనీసం 10 ఎన్‌‌‌‌‌‌‌‌సీడీల కోసం అంటే రూ.10 వేల అమౌంట్‌‌‌‌‌‌‌‌ను ఇన్వెస్ట్ చేయాలి. బాండ్లు మెచ్యూరిటీ అయ్యాక ఇంతే అమౌంట్ తిరిగి ఇన్వెస్టర్లకు అందుతుంది. వడ్డీ అదనం. రూ.12,196 కోట్ల విలువైన అప్పులు ఇచ్చామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ.233 కోట్ల ప్రాఫిట్ సంపాదించామంది.