వెజ్ ఓన్లీ పాలసీపై చర్యలు.. నిరసన తెలిపిన విద్యార్థులపై రూ.10వేల ఫైన్

వెజ్ ఓన్లీ పాలసీపై చర్యలు.. నిరసన తెలిపిన విద్యార్థులపై రూ.10వేల ఫైన్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT B)కి చెందిన ఒక విద్యార్థి సంఘం తమ హాస్టల్ క్యాంటీన్‌లో శాఖాహార ఆహారంపై టేబుల్స్ వేరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థులపై.. మేనేజ్మెంట్ రూ. 10వేలు జరిమానా విధించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుగుతోంది.

ఇదే విషయంపై అక్టోబర్ 1న మెస్ కౌన్సిల్ సమావేశమై.. శాఖాహార విద్యార్థుల కోసం ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ టేబుల్స్ పై వెజ్ మాత్రమే వడ్డించాలని ఈ మెయిల్ లోనూ తెలిపారు.  అంతకుముందు హాస్టల్ క్యాంటీన్ లో నాన్ వెజ్ తిన్నందుకు ఓ విద్యార్థిని కొందరు విద్యార్థులు తీవ్రంగా అవమానించారు.

క్యాంటీన్ గోడలపై వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అర్హులని తెలిపే పోస్టర్లను అతికించి, సోషల్మ మీడియాల్లోనూ షేర్ చేశారు. దీంతో మాంసాహారం తినే విద్యార్థులపై వివక్ష చూపిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు.