నల్లా నీళ్ల నుంచి కరెంట్ పుట్టిస్తం

నల్లా నీళ్ల నుంచి కరెంట్ పుట్టిస్తం

నల్లా పైపుల నుంచి నీళ్లొస్తయి. ఇకపై కరెంట్ కూడా వస్తదట! నల్లా పైపుల్లో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు విడుదలయ్యే ఎనర్జీని  కరెంట్ గా మారుస్తామంటున్నారు ఐఐటీ గౌహతి సైంటిస్టులు. నిల్వ ఉండే నీటి నుంచీ తయారు చేస్తామని చెబుతున్నరు.  దేశంలో అవసరాలకు అనుగుణంగా కరెంట్ఉత్పత్తి కావడం లేదు. సంప్రదాయ ఇంధన వనరులపైనే (బొగ్గు, జల, అణు విద్యుత్​శక్తి) ఆధారపడటమే దీనికి కారణం. ఇప్పుడిప్పుడే సౌర, పవన విద్యుత్, హైడ్రోజన్​ఎనర్జీ మీద ఫోకస్ పెట్టినా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో స్మాల్​స్కేల్​హైడ్రో ఎనర్జీకి సంబంధించి ఐఐటీ గౌహతి రీసెర్చర్స్​కొత్త మెటీరియల్స్​ను రూపొందించారు. పారే నీళ్లతోనే కాకుండా నిల్వ నీటితోనూ కరెంట్​ను ఉత్పత్తి చేస్తాయి.

రెండు కొత్త టెక్నాలజీలు…

కరెంట్ తయారీ కోసం సైంటిస్టులు రెండు  విధానాలను కనుగొన్నారు. తక్కువ స్థాయిలో విద్యుత్​ను ఉత్పత్తి చేసే వీటిని ఇళ్లల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ రెండింటిలో ఒకటి ‘‘ఎలక్ట్రో కైనెటిక్​స్ట్రీమింగ్​పొటెన్షియల్’’. ఈ విధానంలో పారే నీటితో కరెంట్​ఉత్పత్తి చేయొచ్చు. అంటే ఇంట్లోని నల్లాల గుండా వెళ్లే నీటి ద్వారా విద్యుత్​ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇక రెండోది ‘‘కాంట్రాస్టింగ్​ఇంటర్​ఫేసియల్​యాక్టివిటీస్​’’. ఈ విధానంలో సెమీ కండక్టర్ల ద్వారా నిల్వ ఉండే నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. కెమిస్ట్రీ డిపార్ట్​మెంట్​కు చెందిన కల్యాణ్​ రైడొంగియా టీమ్​ఈ రీసెర్చ్​చేసింది.