ఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు..మరో ఐదేండ్లు కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు

ఐఐటీహెచ్ డైరెక్టర్  పదవీకాలం పొడిగింపు..మరో ఐదేండ్లు కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు

సంగారెడ్డి, వెలుగు: ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌ బీఎస్ మూర్తి పదవీకాలాన్ని మరో ఐదేండ్లు పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలతో ఆయన పదవీ కాలం ముగియనుండగా..  పనితీరును పరిగణలోకి తీసుకుని ఆయననే కొనసాగిస్తూ నిర్ణయించింది. 2019 జులైలో పదవీ బాధ్యతలు చేపట్టిన మూర్తికి మరోసారి పదవీ కాలం పెంచడంతో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ఐఐటీ డైరెక్టర్ల మార్పులు జరుగుతుంటాయి.