IIT Kharagpur ..ఖరగ్పూర్ ఐఐటీలో వెజ్,నాన్ వెజ్ స్టూడెంట్లను వేరుచేస్తూ సీటింగ్..విద్యార్థుల ఆందోళన.. వెనక్కి తగ్గిన అధికారులు

IIT Kharagpur ..ఖరగ్పూర్ ఐఐటీలో వెజ్,నాన్ వెజ్ స్టూడెంట్లను వేరుచేస్తూ సీటింగ్..విద్యార్థుల ఆందోళన.. వెనక్కి తగ్గిన అధికారులు

పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటీలో వెజ్,నాన్ వెజ్ సీటింగ్ వివాదం..వెజ్, నాన్ వెజ్ అంటూ విద్యార్థుల విభజన.. ఇదేం తీరు అని విద్యార్థులు ఆగ్రహించడంతో వెనక్కి తగ్గిన అధికారులు. నెల క్రితం ప్రముఖ ఖరగ్ పూర్ ఐఐటీలో డైనింగ్ హాళ్లలో ఆహారపు అలవాట్ల ఆధారంగా సీటింగ్‌ను వేరు చేస్తూ జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ హాల్ దగ్గర విభజన నోటీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా జారీ చేశారని, భోజనశాలలలో అటువంటి నోటీసులు వెంటనే  ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఆదేశించారు. 

 ఆగస్టు 16న ఖరగ్ పూర్ ఐఐటీలోని అంబేద్కర్ హాస్టల్లో టేబుళ్లపై వెజ్ నాన్ బెజ్ బోర్డులు ఏర్పాటు చేశారు. వెజ్ నాన్ వెజ్ విద్యార్థులు ఒకేచోట కూర్చొని భోజనం చేస్తే తమకు అసౌకర్యంగా ఉందని వెజ్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నామని అంబేద్కర్ హాస్టల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. 

అధికారుల నిర్ణయంతో నాన్ విజ్ విద్యార్థుల్లో కలకలం రేపింది. యూనివర్సిటీలో ఇలాంటి వివక్ష ఏంటని నాన్ వెజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.. వీరికి సీనియర్ విద్యార్థులు తోడు కావడంతో వివాదం చెలరేగింది. 

►ALSO READ | బీహార్ లో అమ్మ రాజకీయం : AI వీడియోతో రచ్చ రచ్చ..

విషయం తెలుసుకున్న ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సుమన్ చక్రవరి..అంబేద్కర్ హాస్టల్ అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటను రద్దు చేయాలని ఆదేశాలు జారీ  చేశారు.. ఇనిస్టిట్యూట్ లోని ఏ ఇతర హాస్టళ్లలో కూడా ఇలాంటి నోటీసులు ఉంటే వెంటనే తొలగించాలని కోరారు. 

కేవలం ఫుడ్ తయారీ, పంపిణీ స్థాయిలో వేర్పాటు చూపించాలి..భోజనాల హాలులో విద్యార్థులు కూర్చోవడానికి అలాంటి విభజన ఉండకూడదు అని తెలిపారు సుమన్ చక్రవర్తి .