ఐఎస్​లో చేరుతానన్న ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్

ఐఎస్​లో చేరుతానన్న ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్
  • అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు
  • ఐఎస్​లో చేరుతానంటూ ఈమధ్యే సోషల్ మీడియాలో పోస్ట్

న్యూఢిల్లీ: ఐఎస్​లో చేరాలనుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గౌహతి ఐఐటీ స్టూడెంట్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అస్సాంలోని కమ్రూప్ జిల్లా హజో ప్రాంతంలో అతడిని పట్టుకున్నారు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన యువకుడు ఐఐటీ గౌహతీలో బయోటెక్నాలజీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. తనకు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్​లో చేరాలనుందంటూ ఈ మధ్యే లింక్డ్​ఇన్​తో పాటు ఈమెయిల్స్​ ద్వారా తెలియజేశాడు. 

ఆపై క్యాంపస్​ నుంచి మాయమయ్యాడు. పోలీసులు లుక్​అవుట్ నోటీసులు జారీ చేసి అతడికోసం గాలించారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో జర్నీలో ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 10 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ మెయిల్​ ద్వారా అతడు తెలియజేసిన సమాచారం నిజమే అని గౌహతి క్యాంపస్​కు వెళ్లి నిర్ధారించాకే లుక్​అవుట్ నోటీసులిచ్చామని అస్సాం డీజీపీ పేర్కొన్నారు. అతడి హాస్టల్ రూమ్​లో నుంచి ఐఎస్​ జెండాను పోలిన బ్లాక్ జెండా, ఇస్లామిక్ స్క్రిప్ట్​ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.