వారానికి రెండు రోజులు మాత్రమే పని

 వారానికి రెండు రోజులు మాత్రమే పని

ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద ఫర్నిచర్ కంపెనీ ఐకియా  భారతదేశంలోని తన స్టోర్లలో పనిచేయడానికి 3,000 మందికి పార్ట్-టైమ్ జాబ్స్ ​ఇచ్చింది. వీళ్లు వారానికి రెండు రోజులు మాత్రమే పని చేస్తున్నారు. ఉద్యోగుల్లో చాలా వరకు విద్యార్థులు,  మహిళలు ఉన్నారు.  తమ వర్క్‌‌ఫోర్స్‌‌లో 30శాతం  అంతకంటే ఎక్కువ మంది పార్ట్​టైమర్స్​ ఉండాలనే టార్గెట్​తో పనిచేస్తున్నామని సంస్థ తెలిపింది.  ఈ సంఖ్య యూనిట్లను బట్టి మారుతుందని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. ఉదాహరణకు, బెంగళూరులో 40శాతం పార్ట్‌‌టైమర్లు ఉన్నారని ఐకియా కంట్రీ పీపుల్ అండ్ కల్చర్ మేనేజర్ పరిణీత సిసిల్ లక్రా చెప్పారు.

పార్ట్‌‌టైమర్లను ఐకియా ఉద్యోగులనుగానే గుర్తిస్తామని, థర్డ్-పార్టీ పేరోల్స్‌‌లో ఉండరని ఆమె అన్నారు.    ఆరోగ్య బీమా వంటి వారి ఇతర ప్రయోజనాలు వీరికి వర్తిస్తాయి. లాజిస్టిక్స్, సేల్స్, కస్టమర్ ఇంటరాక్షన్, పీపుల్ & కల్చర్,  ఫుడ్ సెగ్మెంట్ల కోసం పార్ట్​టైమర్ల సేవలను వాడుకుంటున్నారు. కొందరు వారానికి 16 గంటలు, 24 గంటలు లేదా 30 గంటలు చేస్తున్నారు. కొందరు వారాంతాలను మాత్రమే ఇష్టపడుతున్నారు.