పద్మారావునగర్, వెలుగు: వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్ పేట డివిజన్ లోని శివబాగ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్త్ చెకప్ ద్వారా మన ఆరోగ్య పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్, బీఆర్ఎస్ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, రామ్ నివాస్ బన్సాల్ తదితరులు పాల్గొన్నారు.
వనభోజనాలు మన సంస్కృతికి ప్రతీక..
వనభోజనాలు మన సంస్కృతికి ప్రతీకని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లో పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక వన భోజనాలకు ఆయన హాజరయ్యారు. పద్మశాలీలకు ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్రెడ్డి తదితరులు
హాజరయ్యారు.
