స్కూల్ అభివృద్ధి పేరిట వసూళ్లు.. MEO,HM సస్పెన్షన్

స్కూల్ అభివృద్ధి పేరిట వసూళ్లు.. MEO,HM సస్పెన్షన్
  • వీ6, వెలుగు కథనాలతో తల్లిదండ్రుల ఆందోళన.. స్పందించిన విద్యాశాఖ

జగిత్యాల జిల్లా: కోరుట్ల ఎంఇఓ, ఏకిన్ పూర్ స్కూల్ హెడ్మాస్టర్లను విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏకిన్ పూర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో విద్యా వలంటీర్ల కోసం స్కూల్ డెవలప్మెంట్ కమిటీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 13 న స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. 
స్కూల్లో జరుగుతున్న అక్రమ వసూళ్ల ఉదంతంపై వీ6 న్యూస్, వెలుగులో విస్తృత కథనం ఇచ్చింది. ఈ నెల 18న ‘‘ చాక్ పీస్ లకు దిక్కు లేదు..శానిటైజర్లకు పైసల్లేవు’’ శీర్షికన వచ్చిన కథనంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించారు . బుధవారం కోరుట్ల ఎంఈఓ నరేశం, ఏకీన్ పూర్ ప్రైమరీ  స్కూల్ హెడ్ మాస్టర్ రాజ గంగారాంలను సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ వరంగల్ ఆర్జేడీ, జగిత్యాల డీ ఈ వో ఉత్తర్వులు జారీ చేశారు.