కామారెడ్డి జిల్లాలో మూడు నెలల్లో..రెండుసార్లు..ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లాలో మూడు నెలల్లో..రెండుసార్లు..ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు
  • కామారెడ్డి జిల్లాలో ఆగని వసూళ్లు 

 కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఆర్​టీఏ చెక్​ పోస్టుల్లో జోరుగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. ఏసీబీ దాడులు జరుతున్నా వసూళ్ల పర్వం కొనసాగుతూనేఉంది. దాడులు జరిగిన ప్రతిసారి ఆయా చెక్​ పోస్టుల్లో లెక్కల్లో కనిపించని నగదు పట్టుబడుతోంది. జిల్లాలో ఆర్​టీఏకు సంబంధించిన రెండు చెక్​ పోస్టులున్నాయి. హైదారాబాద్​ నుంచి నాగ్​పూర్​కు వెళ్లే హైవేపై భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర, సంగారెడ్డి,-నాందేడ్,​-అకోల హైవే మీద మద్నూర్​ మండలం సలవత్​పూర్​ దగ్గర ఈ చెక్​ పోస్టులున్నాయి. 

ఈ మార్గాల్లో ప్రయాణించే వెహికల్స్​కు సంబంధించి పర్మిట్లు, కెపాసిటీ లోడ్​ వంటి పత్రాలను తనిఖీ చేయాలి. పత్రాలు సరిగ్గా లేకున్నా, పర్మిట్లు లేకున్నా, కెపాసిటీకి మించి లోడ్​ తీసుకెళ్తున్నా ఆర్టీఏ అధికారులు ఫైన్​వేస్తారు. తీవ్రమైన ఉల్లంఘనలుంటే వెహికల్స్​ సీజ్​ చేస్తారు. కానీ ఇక్కడ ఉండే అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతుంటారన్న ఆరోపణులున్నాయి. 

పత్రాల వెరిఫికేషన్​ తూతూమంత్రంగా జరుపుతూ లారీలు, డీసీఎంలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి ఒక్కో వెహికల్​కు రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్ఉతన్నారు. జంగంపల్లి , సలాబత్​పూర్​ ​ చెక్​ పోస్టుల్లో ప్రతి రోజు వేలల్లో అక్రమవసూళ్లు జరుగుతుంటాయి. కొందరు అధికారులు చెక్​ పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని షిప్టుల ప్రకారం వారికి డ్యూటీలు వేస్తూ వసూళ్లు చేయిస్తున్నారు. 

ఏబీసీ దాడులు చేస్తున్నా అగని అక్రమాలు 

రవాణా శాఖ చెక్​ పోస్టుల్లో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా వసూళ్ల దందా అగడంలేదు. ఈ ఏడాది జూలై 17న ఏసీబీ రాష్ట్రవ్యాప్తంగా జరుగిన మెరుపు దాడుల్లో భాగంగా జంగంపల్లి, సలాబత్​పూర్​ చెక్​ పోస్టుల్లోనూ తనిఖీలు చేశారు. భారీగా నగదు సీజ్​ చేశారు. శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామువరకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రికార్డుల్లో లేని నగదు పట్టుబడింది. జంగంపల్లి వద్ద ఏఎంవీఐ మహమ్మద్​ అఫ్రోజుద్దీన్​ డ్యూటీలో ఉన్నారు. 

అతని వెహికిల్​లో లెక్కల్లో చూపని రూ. 5వేల అమౌంట్​ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైవేపై వెళ్తున్న వెహికల్స్​ నుంచి ప్రైవేట్ వ్యక్తులు అమౌంట్​ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద రూ. 45,100 స్వాధీనం చేసుకున్నారు. 

ఇక్కడ మొత్తం రూ.50,100 సీజ్​ చేశారు. మద్నూర్​ మండలం సలావత్​పూర్​ వద్ద ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ అనధికారికంగా రూ.10వేల అమౌంట్ గుర్తించారు. ఇక్కడ డ్రైవర్లు నేరుగా డబ్బులు వేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక బాక్స్​ను ఏర్పాటు చేశారు. ఈ బాక్స్​లో రూ.26వేలు ఉన్నాయి. అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు కూడా పలువురు లారీల డ్రైవర్లు ఈ డబ్బాలో అమౌంట్​ వేసి వెళ్ళారు. ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.