రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వరావుపల్లిలోని సర్వే నెంబర్ 241 లోని ఎర్రబోడు గుట్ట నుంచి కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి గుట్టలను కాపాడాలని జనగామ జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు పోదాల నాగరాజు డిమాండ్ చేశారు.
ఆదివారం ఎర్రబోడు గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సంబంధిత అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశ్వరావుపల్లి రైతులు పొన్నగంటి యాదగిరి, తూరుగొండ చిరంజీవి, శాగ నరేశ్, మీసరగండ్ల నరసయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
