ఇండియన్ స్పెర్మ్టెక్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు

ఇండియన్ స్పెర్మ్టెక్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​తో సంబంధం ఉన్న ఇండియన్​ స్పెర్మ్​ టెక్​సెంటర్​లో గోపాలపురం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా వీర్యకణాలు, అండాలు సేకరించిన ఆరోపణలపై సెంటర్ యజమాని పంకజ్ పాటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఐదుగురు నిందితులు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠను అరెస్ట్ చేశారు. క్లూస్ టీమ్ సహాయంతో స్పెర్మ్, అండాల సేకరణ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

 స్పెర్మ్​టెక్​సెంటర్​పక్కనున్న స్థానికుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించారు. రక్తం శాంపిల్స్​సెంటర్​పేరుతో రెండు నెలలుగా ఇక్కడ ఈ దందా నడుస్తుందని, 8 మంది నర్సులు, నలుగురు ఉద్యోగ సిబ్బంది ఉండేవారన్నారు. మొదటిసారి వచ్చిన వారికి రూ.500, రెండోసారి వస్తే రూ.600 ఇలా రేట్లు పెంచుతూ వెళ్లేవారని, దీనిపై ప్రశ్నిస్తే పంకజ్​పాటిల్​తన వద్ద అన్నీ అనుమతులు ఉన్నాయని చెప్పేవాడని స్థానికులు పోలీసులకు వివరించారు. 

బెయిల్ పిటిషన్ వేసిన నమ్రత

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత తరఫున న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 35 ఏండ్ల కాలం నుంచి డాక్టర్​గా​ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నేరం జరిగినట్లుగా ఆరోపణలు ఏపీలో ఉంటే.. తెలంగాణ పోలీసులు కేసు ఎలా నమోదు చేసి, అరెస్ట్ చేస్తారని పిటిషన్​లో పేర్కొన్నట్లు సమాచారం.