కరోనా అలర్ట్: పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉండండి : IMA

కరోనా అలర్ట్: పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉండండి : IMA

కరోనా కొత్తవేరియంట్ వ్యాపిస్తున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యూఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియాలో రోజుకు దాదాపు 5 లక్షల కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. ఇండియాలో గడిచిన 24గంటల్లో 145 కేసులు వచ్చాయని ప్రకటించింది. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ చేయాలని సూచించింది. 

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కొంతకాలం దూరంగా ఉండాలని చెప్పింది. విదేశీ ప్రయాణాలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని సూచించింది. కోవిడ్ లక్షణాలు ఏవీ కనిపించినా.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని పేర్కొంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది.