దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టండి

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టండి

దేశ వ్యాప్తంగా రోజు వారి కరోనా కేసులు 4 లక్షలు దాటుతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ ఆలస్యమవుతోంది.. పలు రాష్ట్రాల్లో పేషెంట్లకు ఆక్సిజన్ సరైన సమయానికి అందడం లేదు. ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు. డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో లాక్ డౌన్ పెట్టాలని ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్)  కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. కరోనా నియంత్రణలో  అలసత్వం ఎందుకని ప్రశ్నించింది. త్వరగా మేల్కొని చర్యలు చేపట్టాలని కోరింది. కరోనా మహమ్మారి గొలుసును నియంత్రించాలంటే  లాక్ డౌన్ తప్పనిసరి అని సూచించింది. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు, సిబ్బందిని ఏర్పరుచుకోవచ్చని తెలిపింది.