
గండిపేట, వెలుగు: ఐఎంఏ ఇంపాక్స్ బంజారాహిల్స్ నాలుగో వార్షికోత్సవానికి రావాలని సంస్థ అధ్యక్షులు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్జిష్ణుదేవ్వర్మను కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 1న తాజ్ డెక్కన్‌లో వార్షికోత్సవం జరగనుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్లపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.