వైద్య సేవలు విస్తృతం చేయాలి : బీఎన్‌ రావు

వైద్య సేవలు విస్తృతం చేయాలి :  బీఎన్‌ రావు

నల్గొండ అర్బన్, వెలుగు: డాక్టర్లు ఐక్యంగా ఉండి వైద్య సేవలను విస్తృతం చేయాలని ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్‌ రావు సూచించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో డాక్టర్ ఏసీహెచ్. పుల్లారావు అధ్యక్షతన నిర్వహించిన ఐఎంఏ నల్గొండ జోన్ ---–3 అకాడమిక్ కాన్ఫరెన్స్–2023కు చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐఎంఏ నీలగిరి నూతన అధ్యక్షురాలిగా డాక్టర్ అనిత రాణి, జనరల్ సెక్రటరీగా  రమేశ్, ట్రెజరర్ గా  ఎం. ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్లుగా  రాజేశ్వరి ప్రవీణ్,  విజయకుమార్,  విశ్వ జ్యోతి, జాయింట్ సెక్రటరీలుగా  అనుష భరద్వాజ్,  కీర్తి రెడ్డి,  వినోద్ కుమార్‌‌తో  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  డాక్టర్లు టెక్నాలజీని ఉపయోగించుకొని రోగులుకు మెరుగైన వైద్యం అందించాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే అనుభవజ్ఞులైన డాక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచించారు.  

ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో  ఐఎంఏ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ఎం. సంపత్ రావు, కాళీ ప్రసాదరావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుత్త సురేశ్​, డి.ద్వారకానాథ్ రెడ్డి, విజయ రావు, రాజేంద్ర కుమార్ యాదవ్, శేషు యాధవ్, అమిత్ కుమార్, హరి సంధ్యారాణి, రవీందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు, వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు.