న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఐఎండీ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) ఏడాదిలో దేశానికి అవసరమైన వర్షపాతంలో 75 శాతాన్ని అందిస్తాయని చెప్పింది.
అయితే, ఈ ఏడాది మాత్రం దీర్ఘకాలిక సగటులో కేవలం 92 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా వర్షపాతం 90 శాతం నుంచి 95 శాతం మధ్య నమోదైతే దానిని ‘సాధారణం కంటే తక్కువ’ గా పరిగణిస్తారు. ఈ ఏడాది రుతుపవనాలపై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
భారతీయ ప్రజల నమ్మకమైన భాగస్వామ్యానికి, దయకు కష్టకాలంలో వారు అందించిన స్వచ్ఛంద విరాళాలే నిదర్శనం. మెడిసిన్ల రవాణా ప్రక్రియను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన మోదీ ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

