హైదరాబాదీలకు గుడ్ న్యూస్: వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్: వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వర్షాలతో సతమతమవుతున్నా హైదరాబాద్ సిటీ వాసులకు  స్పల్ప ఊరట.. కాలు బయట పెడదామంటే వర్షం..రాత్రి లేదు.. పగల్లేదు..ఆకాషానికి చిల్లు పడిందా అన్న ట్లు వర్షాలు..ఎక్కడ చూసిన నీళ్లే..కాలనీ చెరువులను తలపించాయి. ఇదీ నిన్నటి వరకు హైదరాబాద్ నగర పరిస్థితి.. అయితే నగరవాసులకు వాతావరణ శాఖ ఊరట కలిగించే న్యూస్ చెబుతోంది. 

రాబోయే వారం రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తెలంగాణలో వివిధ జిల్లాల్లో మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి మరో రెండు రోజులు వర్షాలు ఉన్నప్పటికీ  సెప్టెంబర్ 12 తర్వాత వర్షాలు ఉన్నట్లు హెచ్చరికలు లేవు. 

Also read:-తెలంగాణ యంగెస్ట్ స్టేట్.. సాయం చేయండి

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా..  రాబోయే వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎలాంటి వర్షపాత హెచ్చరికలు జారీ చేయలేదు. 

మరోవైపు  సోమవారం ( సెప్టెంబర్ 10) న తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షపాతం నమోదు వివరాలను వెల్లడించింది ఐఎండీ.. సోమవారం ములుగు జిల్లాలో అత్యధి కంగా 51.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా బండ్లగూడలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఈసారి రుతుపవనాలతో 42శాతం వర్షపాతం అధికం 

ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సగటు వర్షపాతం 896.8 మిమీ నమోదైంది.. అయితే సాధారణ వర్షపాతం 631.5 మిమీతో పోలిస్తే 42 శాతం ఎక్కువ. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 508.8 మిల్లీమీటర్లకుగానూ 703.4 మిల్లీమీటర్లు నమోదైంది ఇది 38 శాతం అధికం అని ఐఎండీ తెలిపింది. 

హైదరాబాద్‌లోని నాంపల్లిలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 501.8 మిమీతో పోలిస్తే 809.6 మిల్లీమీటర్లు నమోదైంది-.ఇది 61 శాతం ఎక్కువ.   IMD హైదరాబాద్ సూచన ఈ వారం భారీ వర్షాల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించినప్పటికీ, ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలాఖరులో ఈ రుతుపవనాలు ముగుస్తాయి.