హైదరాబాద్లో వర్షం పడే ఛాన్స్ ఉందా..? వెదర్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే..

హైదరాబాద్లో వర్షం పడే ఛాన్స్ ఉందా..? వెదర్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే..

హైదరాబాద్: భాగ్య నగరంలో ఈరోజు (మంగళవారం, జులై 22) భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు (మంగళవారం, జులై 22) హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే GHMC, మాన్సూన్, DRF,  హైడ్రాను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో హైడ్రా అలర్ట్ పంపించింది.

మొబైల్ ఫోన్స్కు మెసేజ్ అలర్ట్ పంపింది. ట్రాఫిక్, వాటర్ లాగింగ్ ఏరియాల్లో జాగ్రత్తగా  వాహనాలను నడపాలని సిటీ పబ్లిక్కు హైడ్రా సూచించింది. అప్రమత్తం ఉండాలని హైదరాబాద్ సిటీ ప్రజలను హైడ్రా అలర్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి హుస్సేన్ సాగర్కు వరద పెరిగి, ఇప్పటికే నిండు కుండలా మారింది. మళ్లీ భారీ వర్షం కురిస్తే హుస్సేన్ సాగర్లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. 

తెలంగాణలో కురుస్తున్న వర్షాలు.. వాతావరణ శాఖ అధికారులకు కూడా అంతుచిక్కట్లేదు. పొద్దంతా ఎండలు కొట్టినా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేస్తున్నాయి. క్యుములో నింబస్​ మేఘాలొచ్చి కుండపోత కురిపిస్తున్నాయి. ఉపరితల గాలులు, ద్రోణి ప్రభావంతో ఉన్నట్టుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో మొదట ఎల్లో అలర్ట్ను జారీ చేస్తున్న వాతావరణ శాఖ కాస్తా.. అప్పటికప్పుడు ఆరెంజ్​ అలర్ట్ అని సవరించుకోవాల్సి వస్తోంది.

ఐటీ కారిడార్లో చిన్న వాన పడినా ఉద్యోగులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే ఐటీ కారిడార్​లో వాటర్​ లాగింగ్ పాయింట్ల వద్ద  నీరు చేరి రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇనార్బిట్ మాల్​నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్​ వైపు వెళ్లే వెహికల్స్‌‌తో ట్రాఫిక్​ జామ్ అవుతోంది. రాడిసన్ హోటల్​వద్ద మెయిన్ రోడ్డుపై వర్షపు నీరు చెరువును తలపిస్తూ ఉంటుంది.

దీని వల్ల హఫీజ్​పేట, కొండాపూర్, కొత్తగూడ, బొటానికల్​ గార్డెన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే  వెహికల్స్తో ట్రాఫిక్​ ఉంటోంది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్​, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్​పేట్​వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్​ జామ్ అవుతోంది.