ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. కారైకాల్-మహాబలిపురం మధ్య రేపు ( నవంబర్ 30, 2024 ) తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తుఫాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.చిత్తూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
సత్యసాయి,కడప, చిత్తూరు, జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
ALSO READ : ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!
తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం ( నవంబర్ 30, 2024 ) ఉదయం వరకు గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దని సూచించింది వాతావరణ శాఖ. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.