మరో 10 రోజుల్లో నైరుతి వెళ్లిపోతుంది.. : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడ..?

మరో 10 రోజుల్లో నైరుతి వెళ్లిపోతుంది.. : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడ..?

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అక్టోబరు మొదటి వారంలో తెలంగాణ నుంచి తిరోగమనం ప్రారంభించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
హైదరాబాద్‌తో సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని.. అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని చెప్పారు. 

Also Read : ఈ మూడు పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి : ఆకునూరి మురళి

సెప్టెంబర్ చివరి వరకు హైదరాబాద్‌లో కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలనుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

ఇదిలా ఉంటే..  ఆదివారం, సోమవారాల్లో వివిధ జిల్లాల్లో  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సూచన అంచనా వేస్తోంది. ఆదివారం నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేటలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.