2047 నాటికి 8 శాతం వృద్ధి.. ఇండియన్ ఎకానమీపై ఐఎంఎఫ్ డైరెక్టర్ అంచనా

2047 నాటికి 8 శాతం వృద్ధి.. ఇండియన్ ఎకానమీపై ఐఎంఎఫ్ డైరెక్టర్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి  8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లోని ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ అన్నారు. గురువారం టైమ్స్ నౌ సమిట్ లో ఆయన మాట్లాడారు. ‘‘1991 నుంచి భారతదేశ సగటు ఆర్థిక వృద్ధి 7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 8 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఇండియా ఇప్పటి వరకు స్థిరంగా 8 శాతం వద్ద వృద్ధి చెందలేదు. 

కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు. గత పదేండ్లలో అమలు చేసిన పాలసీలను రెట్టింపు చేయడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేస్తే 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధిని సాధిస్తుంది” అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. 8 శాతం వృద్ధిని సాధిస్తే 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఇండియా అవతరిస్తుందన్నారు.  ఇందుకోసం మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, లాజిస్టిక్స్ సెక్టార్లలో సంస్కరణలు  తేవాలని సూచించారు.