శామీర్ పేట,వెలుగు : టీఎస్ స్థానంలో ఇక నుంచి టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో అన్నిశాఖల్లో తక్షణమే అమలు చేయాలని సోమవారం కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి(అటానమస్) సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లు ఇలా అధికారిక కమ్యూనికేషన్లలో టీజీని వాడాలని కలెక్టర్ స్పష్టంచేశారు. లెటర్ హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్ లైన్ జీవోలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్ల వంటివాటిపై టీజీ గా మార్చాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల ఉత్తర, ప్రత్యుత్తరాల్లోనూ టీజీని రాయాలని సూచించారు.
