28 శాతం జీఎస్టీతో చాలా నష్టం..వేలాది జాబ్స్​ పోతాయ్​!

28 శాతం జీఎస్టీతో చాలా నష్టం..వేలాది జాబ్స్​ పోతాయ్​!

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ గేమింగ్ ​పందెం విలువపై జీఎస్టీని 28 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం తమకు గొడ్డలిపెట్టు  వంటిదని ఈ రంగంలోని కంపెనీలు అంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది మంది జాబ్స్​ పోతాయని, కంపెనీలు కూడా మూతబడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నాయకత్వంలోని జీఎస్టీ కౌన్సిల్​ ఆన్​లైన్​ గేమింగ్​పై జీఎస్టీని పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆన్​లైన్ ​గేమింగ్​, గుర్రపు పందేలు, క్యాసినోలపై అధిక పన్ను  వసూలు చేస్తామని ప్రకటించింది. ఆన్​లైన్​ గేమింగ్​పై జీఎస్టీని పెంచాలని ఇదివరకటి మీటింగ్​లోనే నిర్ణయించారు. గోవా మాత్రం ఈ ప్రపోజల్​ను తిరస్కరించింది. గేమింగ్​పై 18 శాతం ఉంటే చాలని వాదించింది. 

  •  మంత్రుల కమిటీ ఇచ్చిన రికమెండేషన్ల ఆధారంగా పన్ను శాతాన్ని 28 శాతానికి పెంచామని కౌన్సిల్​ తెలిపింది. నైపుణ్య ఆధారితతో పాటు అదృష్టం ఆధారిత గేమ్​లకు ఒకే విధమైన పన్ను ఉంటుందని తెలిపింది. యువత ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసలు కాకుండా నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. 
  • లిస్టెడ్​ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్​ దీనిపై స్పందిస్తూ రియల్​ మనీ గేమింగ్​ సెగ్మెంట్​కు మాత్రమే అధిక పన్ను రేటు వర్తిస్తుందని తెలిపింది. తమ బిజినెస్​లో దీని వాటా 5.2 % వరకు మాత్రమే ఉంటుందని ఎక్స్ఛేంజ్​ ఫైలింగ్​లో తెలిపింది. 
  • నైపుణ్యం- ఆధారిత గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు  కాసినోలు/బెట్టింగ్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మధ్య తేడా ఉంటుందని, అన్నింటినీ ఒకే విధంగా చూడకూడదని ఇండియాప్లేస్​ అనే కంపెనీ వాదిస్తోంది. 18 % పన్ను రేటు విధించడం గేమింగ్ పరిశ్రమకు సహాయకరంగా ఉండేదని, దీనిని 28 శాతానికి పెంచడం తప్పని స్పష్టం చేసింది. కొత్త గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, టెక్నాలజీలను అభివృద్ధి చేసే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సామర్థ్యం దెబ్బతింటుందని, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఇండియాప్లేస్ సీఓఓ ఆదిత్య షా అన్నారు.

   కొత్త పన్ను నిబంధనల ప్రకారం,  కాసినోల కోసం కొనుగోలు చేసే చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ముఖ విలువ, బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేదా గుర్రపు పందెం కోసం టోటలైసేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఉంచిన పందెం పూర్తి విలువపై 28 % జీఎస్టీ ఉంటుంది. 
28 శాతం జీఎస్టీని చెల్లించడం ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలకు సాధ్యం కాదు.  వేలాది మంది ఉద్యోగాలు పోతాయి. ఇంత పన్ను భారం భరించలేక కన్జూమర్లు ఆఫ్​షోర్​, ఇల్లీగల్​ ప్లాట్​ఫారాలను ఉపయోగిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఫారిన్​ కరెన్సీ ఖర్చవుతుంది. 

- భవీన్​ పాండ్యా, గేమ్స్​24x7 కో-ఫౌండర్

ఆన్​లైన్​ గేమ్స్​ ఇక నుంచి రూ.వందకు రూ.28 చొప్పున జీఎస్టీ చెల్లించాలి. దీనివల్ల గేమ్స్​ఆడేవారి సంఖ్య తగ్గుతుంది. దీనిపై ఆధారపడ్డ వాళ్లు ఉపాధికి దూరమవుతు తారు. ఇల్లీగల్​ గేమింగ్​ ఎక్కువ అవుతుంది.   శివానీ ఝా, డైరెక్టర్​,ఈ-గేమర్స్  వెల్ఫేర్​అసోసియేషన్​జీఎస్టీ పెంపు వల్ల మనదేశంలోని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది.  ఇది దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకు న్న నిర్ణయం కాదు. ఇది బార్డర్ ​లెస్​ ఇండస్ట్రీ కాబట్టి గేమర్లు విదేశీ కంపెనీలవైపు చూస్తారు.

- అమృత్ కిరణ్ సింగ్,​ 
గేమ్స్ క్రాఫ్ట్  సలహాదారు