
- అక్రమ వలసదారుల తరలింపు షురూ
లండన్: ఇంగ్లిష్ చానెల్ దాటుకొని అక్రమంగా బ్రిటన్‌లోకి చొరబడిన వలసదారుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా బ్రిటన్ ఓ భారతీయుడిని ఫ్రాన్స్‌కు పంపించింది.
‘‘ఈరోజు మేం స్మగ్లర్ల ముఠాలను పెద్ద దెబ్బ కొట్టాం. చిన్న బోట్లలో వచ్చిన అక్రమ వలసదారులను ఫ్రాన్స్‌కు పంపించే ప్రక్రియ మొదలైంది. మా సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటం. అందులో ఇదొక కీలక ముందడుగు. అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తే, తిరిగి పంపిస్తం” అని బ్రిటన్ హోంమంత్రి షబానా మహమ్మద్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
త్వరలో మరింత మందిని తరలిస్తామని చెప్పారు. ఓ భారతీయుడిని బ్రిటన్ పంపించినట్టు ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది. కాగా, ‘వన్ ఇన్ వన్ ఔట్’ పథకం కింద వలసదారులను మార్చుకునేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య నెల క్రితం ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం.. చిన్న బోట్లలో ఇంగ్లిష్ చానెల్ దాటి వచ్చినోళ్లు శరణార్థి హోదాకు అనర్హులైతే బ్రిటన్ వాళ్లను ఫ్రాన్స్‌కు తరలిస్తుంది. బ్రిటన్‌లో వీసా కోసం ఫ్రాన్స్ నుంచి దరఖాస్తు చేసుకొన్న వలసదారులను అదే సంఖ్యలో తీసుకుంటుంది. ఈ పథకం జూన్ 2026 వరకు అమల్లో ఉంటుంది.