గవర్నర్ వ్యవస్థ పై సర్కారియా కమిషన్ కీలక సిఫారసులు

గవర్నర్ వ్యవస్థ పై సర్కారియా కమిషన్ కీలక సిఫారసులు

కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి గవర్నర్​ను నియమిస్తాడు. ఆర్టికల్​ 155 ప్రకారం గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తున్నది. అయితే ఆచరణలో గవర్నర్​ నియామకంలో కేంద్రం పూర్తిగా రాజకీయ ధోరణితో వ్యవహరిస్తున్నది. దీనిని నివారించడానికి సర్కారియా కమిషన్​ కింది సూచనలు చేసింది. నానాటికీ వివాదస్పదమవుతున్న గవర్నర్​వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సర్కారియా కమిషన్​ కీలక సిఫారసులు చేసింది. ఎ. గవర్నర్ గా నియామకమయ్యే వ్యక్తి బయటి రాష్ట్రంవాడై ఉండాలి. ఈ అంశం ఒక సాంప్రదాయకంగా అమలు జరుగుతోంది. 

అయితే, గతంలో హరేంద్ర కుమార్​ ముఖర్జీ పశ్చిమ బెంగాల్​కు చెందిన వ్యక్తి అయినా అదే రాష్ట్రానికి గవర్నర్​గా నియామకమయ్యారు. బి. నియామకానికి రెండేండ్ల ముందు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించకూడదు. ఈ నియమం పూర్తిగా ఉల్లంఘనకు గురవుతోంది. ఉదా: యూపీఏ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్​ గవర్నర్ గా నియమించిన సుశీల్​ కుమార్​ షిండే, మహారాష్ట్ర గవర్నర్​గా నియమించిన ఎస్​.ఎం.కృష్ణలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.సి. గవర్నర్​ నియామకంలో సదరు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఈ నియమం కూడా ఉల్లంఘించబడుతోంది. ఉదా: 2004లో సూర్జీత్​సింగ్​ బర్నాలాను తమిళనాడు గవర్నర్ గా నియమించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను సంప్రదించకుండా నియమించడం వివాదాస్పదమైంది.