మాదాపూర్ లోఆకట్టుకున్న చిత్ర ప్రదర్శన

మాదాపూర్ లోఆకట్టుకున్న చిత్ర ప్రదర్శన

 మాదాపూర్​​లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకారులు జయశ్రీ ప్రభాకర్, కాసుల పద్మావతులు ‘శ్రీప్రభతులు - పద్మవిష్కరణ’ పేరిట ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 250 చిత్రాలు ఈ నెల 6 వరకు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.