ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని జన్కాపూర్ హైస్కూల్లో షిఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి గ్రీన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన పది ప్రభుత్వ హైస్కూళ్లకు చెందిన స్టూడెంట్లు ఇంధన ఆదా, పర్యావరణ పరిరక్షణ అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈసందర్భంగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల సృజనను వెలికితీసి నిత్యజీవిత సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థికి పర్యావరణ అంశాల మీద అవగాహన ఉండాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించేందుకు షిఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతి స్కూల్కు రూ.4.7 లక్షల విలువ చేసే సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. పోటీల్లో జన్కాపూర్ హైస్కూల్ఫస్ట్ ప్లేస్లో నిలువగా, రాస్పల్లి హైస్కూల్ సెకండ్, గంగాపూర్ హైస్కూల్థర్డ్ ప్లేస్లో నిలిచాయి. విజేతలైన స్టూడెంట్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.సుభాష్, ఎఫ్ఏవో జాడి దేవాజీ, హెచ్ఎం ఉమాబాల, షిఫ్ సంస్థ కోఆర్డినేటర్ ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు..
