ఓలలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

ఓలలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
  •     హోరాహోరీగా తలపడ్డ మల్లయోధులు

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలోని ఓల గ్రామంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర కుస్తీ పోటీలు అద్యంతం ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర నుంచి పేరుమోసిన మల్లయోధులతోపాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి హాజరై పోటీల్లో పాల్గొన్నారు. విజేతగా నిలిచిన మల్లయోధుడు సాయినాథ్ బీద్రలికి రూ.5 వేళా నగదు బహుమతి తో పాటు వెండి కడియాన్ని నిర్వాహకులు బహూకరించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

శభాష్ గణేశ్.. ఒంటి చేతితో గెలిచిండు

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దార్మబాద్ తాలూకా కర్ కెల్లీ గ్రామానికి చెందిన గణేశ్ దివ్యాంగుడు. కుస్తీ పోటీలపై ఉన్న ఆసక్తితో ఒంటి చేత్తోనే రంగంలోకి దిగాడు. పోటీల్లో పాల్గొని ఓ రౌండ్​లో విజేతగా నిలిచిన గణేశ్​ను పలువురు అభినందించారు.